Sunday, February 22, 2009

ఆస్కార్‌ వేదికపై ఎఆర్‌ రహమాన్‌ జయహో

ఇండియన్‌ మ్యూజిక్‌ లెజెండ్‌ ఎఆర్‌ రహమాన్‌ అస్కార్‌ కల నిజమైంది. ప్రపంచంలో అత్యుత్తమ సినిమా పురస్కారం అయినటువంటి ఆస్కార్‌ అవార్డును దక్కించుకొని తన సత్తాను చాటారు. ఒకటి కాదు రెండు ఆస్కార్‌ అవార్డులను గెలుచుకొని ఆస్కార్‌ వేదికపై జయహో అనిపించారు. సినీ సంగీత జగత్తులో తనకు తిరుగులేదని ప్రపంచానికి చాటారు.

లాస్‌ఎంజెలెస్‌లోని కొడాక్‌ థియేటర్‌లో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఆస్కార్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో రహమాన్‌ బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్ ఒరిజనల్‌ స్కోర్‌ కేటగిరీల్లో రెండు అవార్డులను అందుకున్నారు.

రహమాన్‌కు రెండు ఆస్కార్‌ అవార్డులుప్రపంచ సినిమా చరిత్రలో భారతీయ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎఆర్‌ రహమాన్‌ చరిత్ర సృష్టించారు. అందరూ ఊహించినట్లుగానే మన సంగీత దర్శకుడు ఎఆర్‌ రహమాన్‌ జయహో అనిపించారు. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రానికి అద్భుత సంగీతాన్నందించిన రహమాన్‌కు రెండు ఆస్కార్‌ అవార్డులు లభించాయి. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఒకటి, ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో రహమాన్‌కు మరో ఆస్కార్‌ దక్కింది. దీంతో స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రానికి ఆరు ఆస్కార్‌ అవార్డులు దక్కాయి.


మన రెహ్మాన్‌కు ఒకటికాదు రెండు ఆస్కార్‌లు లభించాయి. భారతీయ సంగీతం అంతర్జాతీయ వేదికపైప్రతిధ్వనించింది. ఆస్కార్‌ అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడిగా చరిత్ర సృష్టించాడు. బెస్ట్‌ మ్యూజిక్‌కు, బెస్ట్‌ ఒరిజినల్‌ మ్యూజిక్‌కుగాను రెహ్మాన్‌కు రెండు ఆస్కార్‌లు లభించాయి. అవార్డు లభించగానే హర్షధ్వానాలతో ఆస్కార్‌ ప్రాంగణం దద్దరిల్లింది

భారతీయ చిత్రానికి ఆస్కార్

రెహ్మా‌న్‌కు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చిన సందర్భంలోనే మరో భారతీయ చిత్రం ఆస్కార్‌ను గెలుచుకుంది. ఉత్తమ డాక్యుమెంటరీల కేటగిరీలో 'స్మైల్‌ పింకీ' చిత్రం ఆస్కార్‌ను గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక గ్రహణం మొర్రి కారణంగా నవ్వటమే మరిచిపోగా ఓ డాక్టర్‌ దాన్ని సరిచేసి తిరిగి ఎలా నవ్వేలా చేశారో, అందరి పిల్లలతో తానూ సమానమే అన్నఆత్మవిశ్వాసాన్ని ఎలా కల్పించారో ఇందులో చూపించారు.

స్లమ్‌డాగ్‌కు బెస్ట్ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే అవార్డు

లాస్‌ఎంజెలెస్‌ : ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ అవార్డుల్లో భారతీయ చిత్రం స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ విజయపథాక ప్రారంభమైంది. స్లమ్‌డాగ్‌కు బెస్ట్ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే అవార్డు లభించింది. సైమన్‌ బ్యూఫై ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించారు.


9 విభాగాల్లో 10 నామినేషన్లు సంపాదించిన స్లమ్‌డాగ్‌కు ఒక అవార్డు వచ్చింది. అయితే భారతీయ సంగీత దర్శకుడు ఎఆర్‌ రహమాన్‌కు అవార్డు వస్తుందా రాదా అని 100 కోట్లమంది భారతీయుల్లో ఉత్కంఠ నెలకొంది. భారతీయుడైన వికాస్‌ స్వరూప్‌ రాసిన నవల ఆధారంగా స్లమ్‌డాగ్‌ చిత్రం తెరకెక్కింది.

No comments:

Post a Comment