Sunday, February 22, 2009

2008 ఆస్కార్‌ అవార్డుల జాబితా...

కోట్లాది మంది భారతీయుల ఆశల్ని మోస్తూ ఆస్కార్‌ బరిలో ఎఆర్‌ రహమాన్‌ గెలిచారు. తమ అభిమాన మ్యూజిక్‌ డైరెక్టర్‌కు ఈ అవార్డు దక్కాలని ఆయన అభిమానులు దేశవ్యాప్తంగా చేస్తున్న పూజలు ఫలించాయి. మ్యూజిక్‌ సామ్రాట్‌గా, ఉపఖండాన్ని ఉర్రూతలూగించిన రహమాన్‌ ఆస్కార్‌ అందుకున్నాడు. అండ్‌ ద అవార్డు గోస్‌ టు ఎఆర్‌ రహమాన్‌ అనే వ్యాఖ్యాత పిలుపు వినగానే వందకోట్ల మంది భారతీయులు హృదయాలు ఒక్కసారిగా లయ తప్పాయి. క్షణం తర్వాత హర్ష ధ్వానాలు. ఆస్కార్ అవార్డుల ప్రాంగణం దద్దరిల్లేలా.. ఆ చప్పట్లు ప్రపంచం నలుమూలల్లో టీవీలకు అతుక్కుపోయి చూస్తున్న భారతీయుల గుండెల్లో మారుమ్రోగాయి. మన వాడు, చరిత్రలో ఓ భారతీయుడు స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఆస్కార్ బెస్ట్ ఒరిజనల్ సాంగ్, బెస్ట్ ఒరిజనల్ స్కోర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు.
స్లమ్‌డాగ్‌కు 7 ఆవార్డులు
1. బెస్ట్ ఒరిజనల్‌ సాంగ్‌ : ఎఆర్‌ రహమాన్‌ (స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌)2. బెస్ట్ ఒరిజినల్‌ స్కోర్‌ : ఎఆర్‌ రహమాన్‌ (స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌)3. బెస్ట్ అడాప్టెడ్‌ స్క్ర్రీన్‌ప్లే : సైమన్‌ బ్యూఫోయ్‌ (స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌)4. బెస్ట్ సినిమాటోగ్రఫి : అంటోని డాడ్‌మాంటల్‌ (స్లమ్‌డాగ్‌ మిలియనీర్)5. బెస్ట్ సౌండ్‌ మిక్సింగ్‌ (స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌)6. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్‌ : క్రిస్‌ డికెన్‌‌స (స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌)7. బెస్ట్ డైరెక్టర్‌ : డానీ బోయెల్‌ (స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌)
ఉత్తమ సహాయనటి : ఫెనలోపీ క్రూజ్‌ ( వికీ క్రిస్టీనా బార్సీలోనా చిత్రం)
ఉత్తమ సహాయనటుడు : హీత్‌ లెడ్జర్‌ ( ది డార్క్ నైట్‌)
బెస్ట్ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్ : అండ్రూస్టాంటన్‌ (చిత్రం-వాల్‌ ఈ)
బెస్ట్ యానిమేటెడ్‌ షార్ట్ ఫిల్మ్: లా మైనస్‌ ఎన్‌ పెటిట్‌‌సక్యూబ్స్
ఉత్తమ లఘు చిత్రం : టాయ్‌లాండ్‌
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : మైకేల్‌ ఒకానర్‌ ( చిత్రం-ది డచెస్‌)
మేకప్‌ : గ్రెగ్‌ కాసమ్‌ (ది క్యూరియస్‌ ఆఫ్‌ బెంజమిన్‌ బట్టన్‌)
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్.

No comments:

Post a Comment