Showing posts with label ఆస్కార్. Show all posts
Showing posts with label ఆస్కార్. Show all posts

Sunday, February 22, 2009

ఆస్కార్‌ వేదికపై ఎఆర్‌ రహమాన్‌ జయహో

ఇండియన్‌ మ్యూజిక్‌ లెజెండ్‌ ఎఆర్‌ రహమాన్‌ అస్కార్‌ కల నిజమైంది. ప్రపంచంలో అత్యుత్తమ సినిమా పురస్కారం అయినటువంటి ఆస్కార్‌ అవార్డును దక్కించుకొని తన సత్తాను చాటారు. ఒకటి కాదు రెండు ఆస్కార్‌ అవార్డులను గెలుచుకొని ఆస్కార్‌ వేదికపై జయహో అనిపించారు. సినీ సంగీత జగత్తులో తనకు తిరుగులేదని ప్రపంచానికి చాటారు.

లాస్‌ఎంజెలెస్‌లోని కొడాక్‌ థియేటర్‌లో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఆస్కార్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో రహమాన్‌ బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్ ఒరిజనల్‌ స్కోర్‌ కేటగిరీల్లో రెండు అవార్డులను అందుకున్నారు.

రహమాన్‌కు రెండు ఆస్కార్‌ అవార్డులుప్రపంచ సినిమా చరిత్రలో భారతీయ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎఆర్‌ రహమాన్‌ చరిత్ర సృష్టించారు. అందరూ ఊహించినట్లుగానే మన సంగీత దర్శకుడు ఎఆర్‌ రహమాన్‌ జయహో అనిపించారు. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రానికి అద్భుత సంగీతాన్నందించిన రహమాన్‌కు రెండు ఆస్కార్‌ అవార్డులు లభించాయి. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఒకటి, ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో రహమాన్‌కు మరో ఆస్కార్‌ దక్కింది. దీంతో స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రానికి ఆరు ఆస్కార్‌ అవార్డులు దక్కాయి.


మన రెహ్మాన్‌కు ఒకటికాదు రెండు ఆస్కార్‌లు లభించాయి. భారతీయ సంగీతం అంతర్జాతీయ వేదికపైప్రతిధ్వనించింది. ఆస్కార్‌ అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడిగా చరిత్ర సృష్టించాడు. బెస్ట్‌ మ్యూజిక్‌కు, బెస్ట్‌ ఒరిజినల్‌ మ్యూజిక్‌కుగాను రెహ్మాన్‌కు రెండు ఆస్కార్‌లు లభించాయి. అవార్డు లభించగానే హర్షధ్వానాలతో ఆస్కార్‌ ప్రాంగణం దద్దరిల్లింది

భారతీయ చిత్రానికి ఆస్కార్

రెహ్మా‌న్‌కు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చిన సందర్భంలోనే మరో భారతీయ చిత్రం ఆస్కార్‌ను గెలుచుకుంది. ఉత్తమ డాక్యుమెంటరీల కేటగిరీలో 'స్మైల్‌ పింకీ' చిత్రం ఆస్కార్‌ను గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక గ్రహణం మొర్రి కారణంగా నవ్వటమే మరిచిపోగా ఓ డాక్టర్‌ దాన్ని సరిచేసి తిరిగి ఎలా నవ్వేలా చేశారో, అందరి పిల్లలతో తానూ సమానమే అన్నఆత్మవిశ్వాసాన్ని ఎలా కల్పించారో ఇందులో చూపించారు.

స్లమ్‌డాగ్‌కు బెస్ట్ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే అవార్డు

లాస్‌ఎంజెలెస్‌ : ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ అవార్డుల్లో భారతీయ చిత్రం స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ విజయపథాక ప్రారంభమైంది. స్లమ్‌డాగ్‌కు బెస్ట్ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే అవార్డు లభించింది. సైమన్‌ బ్యూఫై ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించారు.


9 విభాగాల్లో 10 నామినేషన్లు సంపాదించిన స్లమ్‌డాగ్‌కు ఒక అవార్డు వచ్చింది. అయితే భారతీయ సంగీత దర్శకుడు ఎఆర్‌ రహమాన్‌కు అవార్డు వస్తుందా రాదా అని 100 కోట్లమంది భారతీయుల్లో ఉత్కంఠ నెలకొంది. భారతీయుడైన వికాస్‌ స్వరూప్‌ రాసిన నవల ఆధారంగా స్లమ్‌డాగ్‌ చిత్రం తెరకెక్కింది.

ఆస్కార్ అకాడమీ ఆవిర్బావ చరిత్ర

1927 ప్రారంభంలో బీజం పడింది. ఎంజిఎం స్టూడియో చీఫ్‌ లూయిస్‌ బి. మేయర్‌ తన ముగ్గురి మిత్రులతో(దర్శకుడు ఫ్రెడ్‌ నిబ్లో, నిర్మాత ఫ్రెడ్‌ బెట్సన్‌, నటుడు కరద్‌ నగేల్‌) కలిసి ప్రపంచవ్యాప్తంగా చిత్రపరిశ్రమకు ఏదైనా మేలు చేసే విధంగా ఒక సంస్థను నెలకొల్పాలనే వీరి ఆలోచనే ఆస్కార్‌ మోషన్‌ పిక్చర్స్స అకాడమీ ఏర్పాటుకు దారితీసింది. ఈ నలుగురు కలిసి లాస్‌ ఎంజెలెస్‌లోని అంబాసిడర్‌ హోటల్‌లో (జనవరి 11 1927లో) ఇంటర్నేనేషనల్‌ అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్‌‌ట్స అండ్‌ సైన్సెస్‌ రూపకల్పనకు ఓ ప్రపోజల్‌ను తయారు చేశారు.
డగ్లస్‌ ఫెయిర్‌బ్యాంక్‌, మేరీ పిక్‌మన్‌ మరో ఇద్దరు కీలక పాత్ర పోషించారు. వీరే అకాడమీ వ్యస్థాపకులుగా చరిత్రలో నిలిచారు. తరువాత అందులోని ఇంటర్నేషనల్‌ను తొలగించారు. అనంతరం వెంటనే ఈ కాన్సెప్టును హాలీవుడ్‌ చిత్రపరిశ్రమలోని ప్రముఖులంతా మెచ్చుకోవడంతో మే 11, 1927న ప్రభుత్వం అకాడమీకి చార్టర్‌ను మంజూరు చేసింది. అనంతరంలో అకాడమీలో 300 మంది సభ్యులు చేరడం, అకాడమీ కోసం100 డాలర్లు సహాయం చేయడం చాలా వేగంగా జరిగింది.
మొదట ప్రారంభంలో ఐదు విభాగాల్లో ( నిర్మాతలు, నటులు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు) ఈ అకాడమీని ప్రారంభించారు. ఈ అకాడమీకి మొదటి అధ్యక్షుడు (1927-29 వరకు) డగ్లస్‌ ఫెయిర్‌బ్యాంక్‌ వ్యవహరించగా రెండో అధ్యక్షుడు (1929-31) విలియం డెమిలీ వ్యవహరించారు. ఇప్పటి వరకు 32 మంది అధ్యక్షలుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆస్కార్‌ మోషన్‌ పిక్చర్స్ అధ్యక్షునిగా సిడ్‌ గ్యానిస్‌ వ్యవహరిస్తున్నారు. అకాడమీ ఆధ్వర్యంలో 1929 మే 16న రూజ్‌వెల్ట్ హోటల్‌లో మొదటి ప్రదానోత్సవం జరిగింది. ప్రస్తుతం 81వ అస్కార్‌ మోషన్‌ పిక్చర్‌ అవార్డు ప్రదానం జరుగుతోంది.